మానవులలో యోని స్తితి స్థాపక కండర మయమైన గొట్టము. ఇది సెర్విక్స్ నుండి వుల్వా వరకు ఉంటుంది.[1] ఉద్రేక స్తిథిలో లేనప్పుడు యోని పొడవు ముందుగా సుమారు 6 నుండి 7.5 సెం.మీ. (2.5 నుండి 3 అంగుళాలు) ఉంటుంది.[2] సంభోగంసమయంలో యోని పొడవు మరియు వెడల్పు శిశ్నం కొలతను బట్టి పెరుగుతుంది.[3] దీని యొక్క అత్యంత సాగే లక్షణం (స్థితిస్థాపక లక్షణం) కారణంగా సంభోగం మరియు శిశువు జననంలో అవసరమైనంత వరకు సాగుతుంది.[4]
నిటారుగా నిలబడి ఉన్న స్త్రీలలో యోని మార్గం, గర్భాశయానికి దాదాపు, 45డిగ్రీల కోణంలో ముందుకు మరియు పైకి ఉంటుంది. యోని ద్వారం బాహ్య
జననేంద్రియంలో మూత్ర ద్వారానికి వెనుకగా ఉంటుంది. యోని పైభాగం పురీషనాళం
నుండి పెరిటోనియల్ సంచి తో వేరుచేయబడి ఉంటుంది. యోని మార్గం మరియు యోని
ద్వారం మ్యూకస్ పొరలు ఎరుపు గులాబీ రంగులో ఉంటాయి.ఇది సంభోగంలో, వంశోత్పత్తిలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
యోని ద్రవాలు ప్రముఖంగా బార్తొలిన్ గ్రంధి నుండి విడుదలౌతాయి. ఇవి యోని మార్గాన్ని తేమగా ఉంచుతాయి. అండం విడుదల సమయంలో ఈ స్రావాలు పలుచగా మారి క్షారగుణం కలిగి ఉండి శుక్ర కణాలు ఎక్కువ కాలం జీవించడానికి తోడ్పడతాయి.
యోని ద్వారాన్ని కన్నెపొర (హైమెన్) అనే సన్నవి మ్యూకస్ పొర కప్పివుంచుతుంది. సాధారణంగా మొదటి లైంగిక కలియకలో (సంభోగంలో) కన్నెపొర చిరిగిపోయి చివరికి నిర్జీవంగా అయిపోతుంది.[5] కన్నెపొర లేకపోతే ఆ స్త్రీ ఇదివరకే రతిలో పల్గొందని, కన్నెపొర వున్నంత మాత్రాన ఆమె 'కన్య' అని నిర్ధారించలేము. అనేక సార్లు సంభోగంలో పాల్గొన్నా
కన్నెపొర చిరగక పోవచ్చు. కొన్ని రకాల వ్యాయామాలు, ప్రమాదాలు మొదలైన కారణాల
వల్ల కన్నెపొర చిరగనూ వచ్చు.
No comments:
Post a Comment